పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898AD’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఇండియా వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. తెలుగు సినిమాలకు మరో మంచి మార్కెట్ అయిన జపాన్‌లో 2025 జనవరి 3న కల్కి సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ప్రభాస్ ఈ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సింది. ఓ సినిమా షూటింగ్ లో కాలికి గాయమవడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. కేవలం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే ప్రమోషన్స్ కోసం జపాన్‌కి వెళ్లారు.
ఈ స్టార్ డైరెక్టర్‌కు ఘన స్వాగతం పలుకుతూ జపనీస్ ఫ్యాన్స్ పంపించిన లెటర్లతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు. జపాన్‌కి సంబంధించిన ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.