తనను సినీ అభిమానులు యూనివర్సల్ హీరో అని పిలుస్తుంటారని, అయితే ఆ టైటిల్‌ను వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. హీరో కమల్‌హాసన్ ఇవాళ ఓ భారీ ప్రకటన రిలీజ్ చేశారు. కమల్‌హాసన్ 2018లో మక్కల్ నీధి మయిం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తనను ముద్దుగా పిలిచే అన్ని టైటిళ్లను వదిలివేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రేమతో తనకు బిరుదులు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. కళాకారులను కళను మించి చూడరాదు అని, మీ ప్రేమాభిమానాలకు పొంగిపోతున్నట్లు కమల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సింపుల్‌గా తనను కమల్ లేదా కమల్‌హాసన్ అని పిలిస్తే సరిపోతుందని సినీ అభిమానులను, పార్టీ కార్యకర్తలను, మీడియాను ఆయన కోరారు.

- November 11, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
administrator