డైరెక్టర్ రాజమౌళి – హీరో మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, తమ్మారెడ్డి భరద్వాజ ఏం మాట్లాడారంటే.. ‘మహేష్ బాబు – రాజమౌళి సినిమా బడ్జెట్ అంటే కచ్చితంగా రూ.1,000 కోట్లు పైమాటే ఉండొచ్చు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు. కాబట్టి, ఈ సినిమా బిజినెస్ మినిమమ్ రూ.2,000 కోట్లు దాటొచ్చని టీమ్ అంచనా… అంతకుమించి ఎంతైనా వసూలు చేసే అవకాశమూ లేకపోలేదు. ఆ నంబర్ రూ.2, 3 వేల కోట్ల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు. భారతదేశ సినీరంగంలోనే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద ఫ్యాన్స్. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు.

- November 11, 2024
0
44
Less than a minute
Tags:
You can share this post!
administrator