ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ఫ్యామిలీస్‌తో తెగ న‌వ్వించేస్తున్న జూనియర్

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ఫ్యామిలీస్‌తో తెగ న‌వ్వించేస్తున్న జూనియర్

జూ.ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా డ్రాగ‌న్ అనే టైటిల్‌తో ప్ర‌చారంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం మ‌నం చూశాం. చివ‌రిగా స‌లార్‌తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క‌లో ఎన్టీఆర్‌పై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాస్త గ్యాప్ దొరికినప్పుడు ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ఫ్యామిలీ స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని ప్రశాంత్ నీల్ తన ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘డ్రాగన్ సినిమా షూటింగ్ బ్రేక్ టైంలో వీరు సందడి చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్‌తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎప్పుడూ స‌ర‌దాగా ఉండే ఎన్టీఆర్ ఏదో జోక్ వేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ జోక్‌కి ప్ర‌తి ఒక్క‌రు తెగ న‌వ్వేస్తున్నారు.

editor

Related Articles