డ్యాన్సర్ అసోసియేషన్ నుండి జానీ మాస్ట‌ర్‌ను తొలగించారు..!

డ్యాన్సర్ అసోసియేషన్ నుండి జానీ మాస్ట‌ర్‌ను తొలగించారు..!

జానీను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. త‌న మీద లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రానంతవ‌ర‌కు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వ‌చ్చాడు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయో అప్పుడే ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని అసోసియేష‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి. ఇక కొత్త పాల‌కవ‌ర్గం ఎన్నుకున్న అనంత‌రం జానీని ఈ అసోసియేష‌న్‌ను తొలగించారని తెలుస్తోంది.

editor

Related Articles