జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ఆగస్ట్ 29న రిలీజ్..

జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ఆగస్ట్ 29న రిలీజ్..

బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ రొమాంటిక్ డ్రామా సినిమా ‘పరమ్ సుందరి’ విడుదల తేదీని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు తుషార్ జలోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మ్యాడాక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా  విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించింది. మొదట జులైలో ఈ సినిమాను విడుదల కావాల్సి ఉండ‌గా.. అనుకోని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే తాజాగా ఆగస్టు 29న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సౌత్ ఇండియా – నార్త్ ఇండియా ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.

editor

Related Articles