‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’ మే 9న రిలీజ్

‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’ మే 9న రిలీజ్

హీరో చిరంజీవి, హీరోయిన్‌గా శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కె.రాఘ‌వేంద్ర రావు రూపొందించిన ఫాంట‌సీ సినిమా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి. ఈ సినిమా మే 9, 1990న విడుద‌లై ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్స‌వం జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో రేపు సినిమాని 2D అండ్ 3D ఫార్మాట్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అప్ప‌ట్లో ఈ సినిమా రిలీజ్ చేయ‌డానికి ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. సినిమా షూటింగ్ స‌మ‌యంలో కూడా చిరంజీవి క‌ష్టాలు ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కి సినిమాని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసి పెద్ద హిట్ సాధించారు. ఈ సోషియో-ఫాంటసీ డ్రామాని వైజయంతి సినిమా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమాలో హీరో చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ క్లాసిక్ సినిమాని లేటెస్ట్ ప్రింట్‌తో నేటితరం ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు చిత్ర బృందం చాలా క‌ష్ట‌ప‌డింది. ఈ క్రమంలో చిరంజీవి, రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్ లతో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్‌గా విడుదలైంది.ఇందులో చిరు, సుమ‌, రాఘ‌వేంద్ర‌రావు ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేయ‌గా, చివ‌ర‌లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ”మాకు తెలుసుకోవాలని ఉంది? ఆ రింగ్ ఏమైంది? ఆ చేప ఏమైంది? 35 సంవత్సరాలు అయింది. దీనికి జవాబు ఆ ఒక్కరే ఇవ్వగలుగుతారు” అని అంటారు.

editor

Related Articles