టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బీటౌన్ డెబ్యూ ఇస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ హీరోగా ఎస్‌డీజీఎంగా రాబోతున్న ఈ సినిమాకి జాట్ టైటిల్‌ను ఫైనల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ మేకర్స్ లాంచ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇవాళ సాయత్రం 4:05 గంటలకు ఎక్జయిటింగ్, భారీ అనౌన్స్‌మెంట్ అంటూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
