ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓజీ తెరకెక్కిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్. ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలారోజుల తర్వాత ఈ డైలాగ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాడు. ఏ సినిమా అప్‌డేట్ అయినా షేర్ చేసే ప్లాట్‌ఫాంలలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా. ఇటీవల కాలంలో సాధారణంగా హీరోలు, డైరెక్టర్లు తమ తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారని తెలిసిందే. అయితే నెట్టింట (ఎక్స్‌లో)అకౌంట్ లేకున్నా సూపర్ క్రేజ్ ఉన్న అతికొద్ది యువదర్శకుల్లో టాప్‌లో ఉంటాడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు దర్శకుడు ప్రభాస్‌తో సాహో తెరకెక్కించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. మొత్తానికి ఫైనల్‌గా అభిమానులతో నేరుగా టచ్‌లోకి వచ్చేందుకు ట్విటర్ ( X ) లోకి ఎంట్రీ ఇచ్చేశాడు సుజిత్. ఎక్స్ అకౌంట్ కవర్ ఫొటోపై ఓజీ స్టిల్‌ను పెట్టుకొని అభిమానుల్లో నయా జోష్ నింపుతున్నాడు సుజిత్.

- December 4, 2024
0
89
Less than a minute
You can share this post!
editor