బ‌న్నీతో అయిపోయింది, చ‌ర‌ణ్‌తో మొదలైంది.. పెద్దిలో ఐటెం సాంగ్‌లో శ్రీలీల

బ‌న్నీతో అయిపోయింది, చ‌ర‌ణ్‌తో మొదలైంది.. పెద్దిలో ఐటెం సాంగ్‌లో శ్రీలీల

ఈ మ‌ధ్య హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో నర్తించి సంద‌డి చేసేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు. క్రేజ్‌కి క్రేజ్‌, రెమ్యూన‌రేష‌న్‌కి రెమ్యూన‌రేష‌న్ వ‌స్తుండ‌డంతో స్టార్ హీరోల సినిమాల‌లో స్పెష‌ల్ సాంగ్‌కి సై అంటున్నారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇపుడు స్పెషల్ సాంగ్స్‌గా మారిపోయినా వాటికి ఉన్న డిమాండ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో సినిమాల్లో ఐటెం సాంగ్స్ వుంటూనే ఉన్నాయి కానీ కాలం మారుతున్న కొద్దీ వాటి రూపు రేఖ‌లు మారుతున్నాయి. ఒక పది, ఇరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఐటెం సాంగ్స్ అంటే దానికి సెపరేట్‌ బ్యాచ్ ఉండేది, కాని ఇప్పుడ‌లా కాదు. హీరోయిన్స్‌నే దింపేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్‌గా ఉన్నవారిని కూడా ద‌ర్శ‌కులు ఐటెం భామలుగా మార్చేయడం స్టార్ట్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేసిన ఐటెం సాంగ్ పుష్ప 1లోని ఊ అంటావా మామ‌.. పాట‌. ఇందులో స‌మంత త‌న గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టింది. ఇక ఆ త‌ర్వాత పుష్ప‌2 కోసం డ్యాన్స్ ఫైర్ శ్రీలీల‌ని దింపారు. ఇప్పుడు శ్రీలీల‌కి మ‌రో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ ద‌క్కింద‌ట‌.

editor

Related Articles