రాజ‌మౌళి-మ‌హేష్ బాబు సినిమాకి స‌డెన్‌గా వేసవి సెలవులా..!

రాజ‌మౌళి-మ‌హేష్ బాబు సినిమాకి స‌డెన్‌గా వేసవి సెలవులా..!

 టాలీవుడ్ హీరో మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ఎక్కువ శాతం ఫారెన్ లోనే షూటింగ్ చేయాల్సి ఉండ‌గా, దానికి కొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ప్ర‌స్తుతానికి ఇండియాలో షూటింగ్ జ‌రుపుతున్నాడు. సినిమా తొలి షెడ్యూల్ ఒరిస్సాలో జ‌రిపిన జ‌క్క‌న్న ఇప్పుడు తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు. స్పెషల్ సెట్ వేసి ప్రియాంక చోప్రా, మ‌హేష్ బాబు మ‌ధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిపినట్టు తెలుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందులో కొంత షూటింగ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. దీని తరువాత కొన్నిరోజులు ఇండియాలోనే షూటింగ్ చేసి ఫారెన్ ప్లైట్ ఎక్కాలని అనుకున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఇటీవ‌ల‌ తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రెన్యువల్ చేయించారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తిచేసి వ‌చ్చే ఏడాది సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న‌లో జ‌క్క‌న్న ఉన్న‌ట్టు తెలుస్తోంది.

editor

Related Articles