షారుక్‌ ఖాన్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే బావుంటుందని: విజయ్ దేవరకొండ

షారుక్‌ ఖాన్, అల్లు అర్జున్ కలిసి నటిస్తే బావుంటుందని: విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ ముంబై వేదిక‌గా జరుగుతున్న‌ ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)’లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందని విజయ్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. చిత్రనిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కలిసి పనిచేస్తే ఆ సినిమాలు దేశాన్ని సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా ఏకం చేస్తాయ‌ని అభిప్రాయపడ్డారు. షారుఖ్ ఖాన్ నటించిన చివరి సినిమా దాదాపు రూ. 800-1000 కోట్లు వసూలు చేసిందని, అల్లు అర్జున్ చిత్రం కూడా రూ. 1000 కోట్ల మార్కును దాటిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఇద్దరు వేర్వేరు ప్రాంతాల తారలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే, అది దేశాన్ని ఏకం చేయడమే కాకుండా నిజమైన పాన్-ఇండియన్ సినిమా అనుభూతిని కలిగిస్తుందని విజయ్ పేర్కొన్నారు.

editor

Related Articles