విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని మార్చి 28న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, మ్యాడ్‌స్క్వేర్ సినిమాలు వరుసగా మార్చి 28, 29 తేదీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్‌ను రీషెడ్యూల్ చేశారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో సినిమా బృందం నుండి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- January 21, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor