ఈ మధ్య సెలబ్రిటీలు మతపరమైన చిక్కుల్లో పడుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ నయనతార నుండి మొదలుకొని తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరకు అందరూ ఎదో ఒక విషయంలో మతపరమైన చిక్కుల్లో పడి క్షమాపణలు చెప్పిన వారే ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక టీవీ షోలో భాగంగా వారు చేసిన ఒక స్కిట్ వలన హిందువుల మనోభవాలు దెబ్బతిన్నయంటూ కొందరు మతపెద్దలు వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దీంతో దిగొచ్చిన యాంకర్ రవి వారికి క్షమాపణలు తెలిపాడు. ఒక షోలో భాగంగా.. సుడిగాలి సుధీర్‌ని రవి పట్టుకుని నంది విగ్రహం నుండి చూస్తే శివుడు కనిపిస్తాడని చెప్పగా.. నాకు మాత్రం అమ్మాయి కనిపిస్తోందంటాడు సుధీర్. అయితే ఈ సన్నివేశం చిరంజీవి బావగారు బాగున్నారా చిత్రంలోనిది. ఇందులో నుండి తీసుకుని రిపీట్ చేశాడు సుధీర్. అయితే ఈ స్కిట్‌పై పలు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉన్నాయని.. దేవుళ్లతో మీ స్కిట్‌లు ఏంటంటూ యాంకర్ రవితో పాటు సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. కొందరు హిందూ ఆర్గనైజేషన్‌కి చెందిన వ్యక్తులు అయితే రవికి కాల్ చేసి మరీ తిట్టారు. ఇక స్కిట్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుండి ఆ వీడియోను డిలీట్ చేశారు. అంతటితో ఈ గొడవ సర్దుమణిగింది.

- April 11, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor