హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొద్దిరోజులుగా హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 63 ఏళ్లు ఉన్న టామ్ 37 ఏళ్ల అనా డి అర్మాస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు హాలీవుడ్‌లో పలు కథనాలు వెల్లడయ్యాయి. తాజాగా, వీరిద్దరూ లండన్‌లో చేతులు పట్టుకుని కలిసి నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఫ్యాన్స్ మాత్రం ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమేనని కొందరు అంటున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు టామ్ క్రూజ్ కానీ, అనా డి అర్మాస్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. వీరిద్దరూ తమ రిలేషన్‌పై మౌనం వహించడంతో ఈ పుకార్లకు మరింత ఇంపార్టెన్స్ పెరిగింది.

- July 30, 2025
0
94
Less than a minute
Tags:
You can share this post!
editor