అలాంటి పాత్ర చేయనని చెప్పను కానీ.. మార్పులు చేస్తే తిరిగి చేస్తా..

అలాంటి పాత్ర చేయనని చెప్పను కానీ.. మార్పులు చేస్తే తిరిగి చేస్తా..

‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కథానాయిక షాలినీ పాండే పోషించిన ‘ప్రీతి’ పాత్రను ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఓ విధంగా ఆ సినిమా విజయంలో ఆ పాత్ర ప్రభావం చాలా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర షాలినీకి రాలేదనే చెప్పాలి. అయితే.. రీసెంట్‌గా ఆమె ‘డబ్బా కార్టెల్‌’ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఆ సిరీస్‌ ఓటీటీలో పెద్ద హిట్‌. అందులో బలమైన మహిళగా కనిపించి, ప్రశంసలందుకుంటోంది షాలినీ పాండే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మరోసారి ‘అర్జున్‌రెడ్డి’ లాంటి సినిమాలో ప్రీతి తరహా పాత్ర చేయాల్సివస్తే చేస్తారా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘నేను కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో చేసిన సినిమా అది. ఇప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తుంది. ఆ పాత్రను ఇంకాస్త బలంగా రాయెచ్చేమో అనుకుంటున్నా. మరోసారి ఆ తరహా పాత్ర వస్తే చేయనని చెప్పను కానీ.. దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అప్పుడు చేస్తా.

editor

Related Articles