డైరెక్టర్ సుకుమార్‌ సినిమాలో విలన్‌గా?

డైరెక్టర్ సుకుమార్‌ సినిమాలో విలన్‌గా?

బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ఖాన్‌తో దర్శకుడు సుకుమార్‌ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని గత కొద్ది నెలలుగా ముంబయి సినీ సర్కిల్స్‌లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. షారుక్‌ను నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పవర్‌ఫుల్‌ పాత్రలో ప్రజెంట్‌ చేస్తూ సుకుమార్‌ ఓ స్క్రిప్ట్‌ తయారు చేశారని, రూరల్‌ పొలిటికల్‌ కథాంశంతో కూడిన ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ పాత్ర రా అండ్‌ రస్టిక్‌గా సాగుతుందని, ఇందులో సామాజిక అంతరాలను కూడా చర్చించారని ఆ గాసిప్స్‌ సారాంశం. అయితే ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా..ఈ సూపర్‌ కాంబో సాకారమైతే చూడాలని అభిమానులు మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లో ఎదురులేని హీరోగా ఉన్నారు షారుక్‌ఖాన్‌, ఇక ‘పుష్ప-2’తో భారతీయ సినిమాలో కొత్త చరిత్ర సృష్టించారు సుకుమార్‌. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌ అంటే ఇక అభిమానులకు పండగే. బాక్సాఫీస్‌కు కాసుల వర్షమే అంటున్నారు.

editor

Related Articles