‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మలయాళ నటుడు మమ్ముట్టి ఎక్స్ వేదికగా స్పందించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. ఇందులో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా మలయాళ నటుడు మమ్ముట్టి కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించాడు. నిజమైన హీరోలకు వందనం! దేశం పిలిచినప్పుడు భారతసైన్యానికి అడ్డంకులు కలిగించకుండా ఉంటే వారి పని వారు చేసుకుంటూ పోతారు అదే భారత దేశ సైన్యం కర్తవ్యం. అలా ఆపరేషన్ సింధూర్ మరోసారి రుజువు చేసింది. ప్రాణాలను కాపాడినందుకు, ఆశను నిలిపినందుకు మీకు ధన్యవాదాలు. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్! అంటూ మమ్ముట్టి రాసుకొచ్చాడు.
- May 7, 2025
0
170
Less than a minute
Tags:
You can share this post!
editor

