నువ్వే నా కలల ప్రపంచం

నువ్వే నా కలల ప్రపంచం

శ్రీలీల పేరు ఇప్పుడు హిందీ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో తొలి సినిమా విడుదల కాకముందే ఈ హీరోయిన్ ముంబయి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. అందుక్కారణం హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో ఈ అమ్మడి లవ్‌ ఎఫైర్‌ గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలే. బాలీవుడ్‌ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్నది శ్రీలీల. అనురాగ్‌బసు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే కార్తీక్‌ ఆర్యన్‌, శ్రీలీల ప్రేమలో పడ్డారని, కార్తీక్‌ ఆర్యన్‌ ఫ్యామిలీ పార్టీకి శ్రీలీలను ప్రత్యేకంగా ఆహ్వానించారని, ఈ జంట గుట్టుగా ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్‌ మీడియాలో కథనాలొచ్చాయి. ‘ఓ డాక్టర్‌ మా ఇంటికి కోడలిగా రావాలనుకుంటున్నాం’ అంటూ ఇటీవల ఓ అవార్డుల వేడుకలో కార్తీక్‌ ఆర్యన్‌ తల్లి వ్యాఖ్యానించడంతో ఈ జంట లవ్‌ ఎఫైర్‌కు మరింత బలం చేకూరినట్లయింది. కార్తీక్‌ ఆర్యన్‌ – శ్రీలీల నటిస్తున్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరుగుతోంది. అక్కడి కాఫీ తోటల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

editor

Related Articles