బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. రితేష్ దేశ్‌ముఖ్, వాణికపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 21, 2025 మహాశివరాత్రి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా నుండి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇన్‌కమ్ టాక్స్‌లో సీనియర్ అధికారి అయిన అమయ్ పట్నాయక్ (అజయ్ దేవ్‌గణ్) అటు రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ మ్యాన్‌ల ఇంటిపై రైడ్‌లు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తుంటాడు. అయితే అమయ్ పట్నాయక్‌కి ఒక రాజకీయ నేత ఇంటిపై ఐటీ రైడ్ చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశం వస్తుంది. ఈ క్రమంలోనే రైడ్ చేయడానికి ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది.

- March 28, 2025
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor