మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు. ఇటీవలే జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద చోటు చేసుకున్న వివాదం గొడవలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన జర్నలిస్ట్‌పై మంచు మోహన్‌బాబు దాడి చేశారు. ఈ దాడిలో టీవీ9 జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మోహన్‌బాబు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇటీవలే తన మనవరాలిని కలిసేందుకు దుబాయ్‌కి వెళ్లారని.. అనంతరం తిరిగొచ్చి తిరుపతిలోని విద్యా సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, దాడి ఘటనలో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

editor

Related Articles