హార‌ర్‌, కామెడీ సినిమాలో రష్మిక..

నేషనల్  క్రష్ రష్మిక మంధాన బాలీవుడ్‌లో వ‌రుస చిత్రాల‌ను చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో యానిమ‌ల్‌తో హిట్ కొట్టి  ప్ర‌స్తుతం మ‌రో మూవీలో న‌టిస్తోంది. హారర్‌‌‌, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకోనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి ‘థ‌మా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ యూనివ‌ర్స్ ఓ ప్రేమ కథను కోరుకుంటోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్న‌దని టీమ్ తెలిపింది. ఈ చిత్రం వచ్చే ఏడాది (2025) దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

               ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ రష్మిక పరిచయ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా రష్మిక ఖాతాలో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికందర్ తదితర చిత్రాలున్నాయి.

editor

Related Articles