2024 ఇయర్ ఎండిగ్ సినిమాలివే..

2024 ఇయర్ ఎండిగ్ సినిమాలివే..

2024 ఎండింగ్ వచ్చేసింది. అయితే ఈ ఇయర్ ఎండింగ్​లోపు పలు సినిమాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో చూద్దామా..!

బేబీ జాన్‌ : కీర్తి సురేశ్​, వరుణ్​ ధావన్ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘బేబీ జాన్‌’. తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న ‘తెరి’కి రీమేక్​గా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్‌ 25న ఈ మూవీ విడుదల కానుంది

‘బరోజ్‌ 3 D’ : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “బరోజ్” ట్రైలర్ ఇప్పటికే అందరిని అలరించింది. అద్భుతమైన విజువల్స్‌తో అంచనాలు పెంచిన బరోజ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ అనే ఓ నవలను ఆధారంగా తీసిన ఫాంటసీ స్టోరీ ఇది.

మాక్స్ :  హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మాక్స్’. ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌ :  కామెడీ​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే  వెన్నెల కిశోర్‌ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్​తో  ప్రధాన పాత్రలో రైటర్‌ మోహన్‌ తెరకెక్కించిన ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’లో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

editor

Related Articles