నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘హిట్: ది థర్డ్ కేస్’. సక్సెస్‌ఫుల్ ‘హిట్’ సినిమా ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి హీరోయిన్. ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో నాని స్టైలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. కశ్మీర్ షెడ్యూల్‌లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నామని, ఇవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్.