ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి?

ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి?

సినిమాల ఎంపికలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే అంగీకరిస్తుంది. అందుకే ఆమె ఒప్పుకునే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్య కథాంశమిది. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది. ఈ కథ సాయిపల్లవికి బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించిందట. అయితే ఈ వార్తలో వాస్తవమేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం సాయిపల్లవి ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకానుంది. అనంతరం ‘ఎల్లమ్మ’ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

editor

Related Articles