టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన సినిమా ఇది..!

టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన సినిమా ఇది..!

విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘సింగిల్ రాజు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. యువ దర్శకుడు ఎస్.ఎస్. వర్మ రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు Venu Udugula ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా Venu Udugula మాట్లాడుతూ, కథ ఎంతో ఆసక్తికరంగా ఉందని, చిత్ర బృందం అంకితభావంతో పనిచేస్తోందని ప్రశంసించారు. టైటిల్ లోగోలో కనిపిస్తున్న బ్రోకెన్ హార్ట్ ఎమోజీ ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అని సూచిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

Related Articles