తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిల్ తిరుమేని డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ సినిమా నుండి ‘సవదీక..’ అనే ఫాస్ట్‌బీట్ పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని అందించారు. ఎడారిలో తప్పిపోయిన తన భార్య కోసం కథానాయకుడు చేసే అన్వేషణ, ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్స్ నుండి అతనికి ఎదురయ్యే ప్రతిఘటన నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అజిత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని, పోరాట ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో త్రిష, అర్జున్, రెజీనా, నిఖిల్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- December 28, 2024
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor