అమరన్‌ డైరెక్టర్ నుండి మరో బయోపిక్‌!

అమరన్‌ డైరెక్టర్ నుండి మరో బయోపిక్‌!

కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నారు ధనుష్‌. మరోవైపు ఆయన కథానాయకుడిగా ఇళయరాజా బయోపిక్‌ కూడా తెరకెక్కనుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఇదిలావుంటే.. అనుకోకుండా ధనుష్‌ డైరీలో ఓ కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని తెలుస్తోంది. ‘అమరన్‌’ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారని చెన్నై సమాచారం. నిజానికి రాజ్‌కుమార్‌ ఓ బాలీవుడ్‌ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ఆ సినిమాకంటే ముందే ధనుష్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కథ విషయంలో రకరకాల కథనాలు సోషల్‌ మీడియాలో వెలువడుతున్నాయి. మనదేశంలో చాలామంది రియల్‌లైఫ్‌ హీరోలున్నారని, వారి కథలతో సినిమాలు తీస్తే అద్భుతాలు సృష్టించొచ్చని గతంలో రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దానికి తగ్గట్టే ధనుష్‌తో ఆయన చేయబోతున్న సినిమా కూడా రియల్‌లైఫ్‌ స్టోరీనే అని తెలుస్తోంది. ఇందులో శ్రుతిహాసన్‌ కథానాయికగా ఎంపికైందట.

editor

Related Articles