సూసైడ్ చేసుకున్న రేడియో జాకీ సిమ్రాన్ సింగ్

సూసైడ్ చేసుకున్న రేడియో జాకీ సిమ్రాన్ సింగ్

జమ్మూకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ సూసైడ్ చేసుకుంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47లో సిమ్రాన్ ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మ‌హత్య చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ప్లూయెన్స‌ర్‌గా రేడియో జాకీగా సిమ్రాన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే సూసైడ్ చేసుకున్న విష‌యాన్ని స్నేహితురాలు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక సంఘ‌ట‌నా స్థ‌లంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.

editor

Related Articles