‘ఆది పురుష్’లో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పాడట..

‘ఆది పురుష్’లో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పాడట..

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ ‘ఆదిపురుష్’ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అలాగే ఓటీటీలో కూడా ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి ‘ఆది పురుష్‌’ సినిమా చూపించిన తర్వాత సారీ చెప్పానని బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్ కామెంట్స్‌ చేశారు. ఇంతకీ, సైఫ్‌ అలీ ఖాన్ ఏం మాట్లాడారు అంటే.. నేను ‘ఆదిపురుష్‌’లో విలన్‌గా నటించాను. సైఫ్ అలీఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ఆది పురుష్‌లో విలన్‌గా నటించినందుకు నేను నా కొడుక్కి సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలను ఎలా గౌరవిస్తానో ఆది పురుష్‌ను కూడా అలానే చూస్తాను. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది అని సైఫ్ అలీఖాన్ తెలిపారు.

editor

Related Articles