ర‌ష్మిక కన్నడ ఇండ‌స్ట్రీని అప్పుడే మ‌ర్చిపోయిందా.?

ర‌ష్మిక కన్నడ ఇండ‌స్ట్రీని అప్పుడే మ‌ర్చిపోయిందా.?

హీరోయిన్ ర‌ష్మిక‌పై క‌న్న‌డ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే పుష్ప 2 ది రూల్, యానిమ‌ల్ సినిమాలతో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ర‌ష్మిక తాజాగా న‌టించిన సినిమా ఛావా. బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ సినిమాకు ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హారాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తీశారు. వాలంటైన్స్ డే కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ వేడుక‌లో ర‌ష్మిక చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. ర‌ష్మిక మాట్లాడుతూ.. నేను హైద‌రాబాద్ నుండి వ‌చ్చాను. అయినా కూడా ముంబై ప్రేక్ష‌కులు నామీదా చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్య‌లు వివాదాస్పదం కావ‌డంతో పాటు ఈ వ్యాఖ్య‌ల‌ను క‌న్న‌డ ప్ర‌జ‌లు త‌ప్పు ప‌డుతున్నారు. ర‌ష్మిక ఏ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చిందో అప్పుడే మ‌ర్చిపోయిందా..

editor

Related Articles