డాన్స్ ప్రేమికులను అలరించిన ‘డాన్స్ ఐకాన్ సీజన్ 1’ డాన్స్ షోకు కొనసాగింపుగా రూపొందిన డాన్స్ షో ‘డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్’. శుక్రవారం నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ డాన్స్ షో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీన్ 2 హోస్ట్ అయిన ఓంకార్, ఫరియా అబ్దుల్లా హోస్టులుగా, శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ‘డాన్స్ ఐకాన్2 – వైల్డ్‌ఫైర్’లో అయిదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తారని, దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారని హోస్ట్ ఓంకార్ తెలిపారు. ఇంకా ఆయన చెబుతూ ‘ఇప్పటివరకూ వచ్చిన డాన్స్ షోల్లో ఇది పూర్తిగా భిన్నమైంది. ప్రతిభ కలిగిన తెలుగువాళ్లను సీక్రెట్ స్క్రీనింగ్ ద్వారా సెలక్ట్ చేస్తున్నాం. మరింత టఫ్ కాంపిటీషన్‌లో తెలుగువారి సత్తా చాటాలనే సంకల్పంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది’ అని ఓంకార్ తెలిపారు. ఇంకా మెంటార్లు మానస్, యష్, ప్రకృతి కూడా మాట్లాడారు.

- February 15, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor