సమంత ‘శుభం’ సినిమాకి మంచి రెస్పాన్స్!

సమంత ‘శుభం’ సినిమాకి మంచి రెస్పాన్స్!

హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత తెలుగులో నటిగా అలాగే నిర్మాతగా చేసిన మొదటి చిత్రమే “శుభం”. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులతో చేసిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే మంచి బజ్‌ని సొంతం చేసుకుంది. ఇలా మేకర్స్ తమకి ఉన్న నమ్మకంతో సినిమాకి ఏకంగా రెండు రోజులు ముందే ప్రీమియర్స్‌ని తెలుగు రాష్ట్రాల్లో వేసుకోవడం విశేషం. మరి ఇంట్రెస్టింగ్‌గా ఈ ప్రీమియర్స్ నుండి శుభం చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపు అన్ని పైడ్ ప్రీమియర్స్ ఫుల్స్ అవ్వడమే కాకుండా షోస్ అయ్యాక మంచి రెస్పాన్స్‌ని కూడా ఈ సినిమా ఆడియెన్స్ నుండి అందుకుంది. దీంతో మే 9న ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్‌కి మాత్రం ఇది మంచి బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు నటించగా కీడా కోలా, సినిమా బండి నటుడు రాగ్ మయూర్ కూడా నటించాడు.

editor

Related Articles