‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ ఈ నెల 14న రిలీజ్

‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ ఈ నెల 14న రిలీజ్

జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’. బెర్ల్‌ సింగర్‌, సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, సురేంద్రన్‌ జయశేఖర్‌ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న  విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో నడిచే కథ ఇది. కొందరు చారిత్రక వ్యక్తుల నిజ జీవితాలతో రూపొందించాం. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. ఇలాంటి కథ ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు అని చెప్పారు. ఈ సినిమాకి సంగీతం: శ్రీరాజ్‌ సాజి, నిర్మాతలు: మీనా చాబ్రియా.

editor

Related Articles