నా పిల్లలను కూడా దీవించండి వాళ్లు స్టార్లు ఔతారు: షారూఖ్‌ఖాన్

నా పిల్లలను కూడా దీవించండి వాళ్లు స్టార్లు ఔతారు: షారూఖ్‌ఖాన్

నాపై చూపిస్తున్నఅభిమానంలో సగం వంతు నా పిల్లలపై కూడా చూపించండంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో షారూఖ్‌ఖాన్. బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న తాజా వెబ్ సిరీస్ బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో షారూఖ్‌ఖాన్‌తో పాటు అతడి కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. అభిమానులందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. నా కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. అలాగే నా కూతురు సుహానా ఖాన్ నటిగా నటించబోతోంది. ఈ సిరీస్‌లో కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికే చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి.

editor

Related Articles