‘జటాధర’ సినిమాకు ఆర్థిక కష్టాలు..?

‘జటాధర’ సినిమాకు ఆర్థిక కష్టాలు..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో ‘జటాధర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తుండగా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘జటాధర’ సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల మధ్య కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు లీగల్‌గా ఒకరిపై మరొకరు ఫైట్ చేస్తున్నారట. కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ‘జటాధర’ సినిమాకి సంబంధించి 50 శాతం హక్కులు తమకు ఇచ్చారని.. అయితే ఇప్పుడు ఎస్ కె జి సంస్థ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఎస్ కె జి సంస్థకు మద్దతు తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, 50 శాతం వాటా ఇవ్వాలని… అయితే, వారు ఇప్పటికి కేవలం రూ.60 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

editor

Related Articles