సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు. ప్రతి ఒక్కరు అందంతో అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఈ ముద్దుగుమ్మలు టైం స్పెండ్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చేస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ అభిమానులతో చిట్ చాట్ చేయగా, ఓ అభిమాని అయితే ఏకంగా పెళ్లి రిక్వెస్ట్ పెట్టాడు. మీకు నచ్చినట్టు ఉంటానని అన్నాడు. మరి దీనికి ఆ హీరోయిన్ ఎలాంటి రిప్లై ఇచ్చింది అనే కదా మీ డౌట్. ఇలా సౌత్ నుండి హిందీ సినిమాకి కూడా మాళవిక మోహనన్ క్రేజ్ పాకింది. ప్రస్తుతం తన డెబ్యూ తెలుగు సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కలయికలో ది రాజా సాబ్ అనే సినిమాలో చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అభిమానులతో ముచ్చటించింది . అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ క్రేజీ అభిమాని మాళవికను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దానికి మాళవిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.. మీరు కోరుకునే భర్త.. మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి.. ది బెస్ట్ హజ్బెండ్‌లా ఉండాలని అనుకుంటున్నాను దీనికి మీ సమాధానం ఏంటని అడగగా, అందుకు మాళవిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేను ఇప్పుడు పెళ్లికి సిద్దంగా లేను.. ఇప్పుడు నాకు భర్త వద్దు అని పేర్కొంది. ఓ నెటిజన్ జాంబీగా మారితే ఏ హీరోతో ఉంటావ్ అని అడగగా, దానికి ప్రభాస్ పేరు చెప్పింది. ప్రభాస్ అయితే పక్కన ఉన్న వారికి సరిపోయేంత ఫుడ్ తీసుకొస్తాడు కాబట్టి జాంబీగా మారినప్పుడు ఇక నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది మాళవిక.

- March 13, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor