‘నాన్న కూడా ముఫాసా లానే’.. మహేష్ కూతురు సితార..

‘నాన్న కూడా ముఫాసా లానే’.. మహేష్ కూతురు సితార..

మహేష్‌బాబు ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా పాత్రకి తన వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. హీరో మహేష్‌బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ కూతురిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. సితార ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ది లయన్ కింగ్‌లో ముఫాసా ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి మా నాన్న ఈ సినిమా చేసినందుకు నేను గర్వపడుతున్నాను. నాన్న మమ్మల్ని కూడా సినిమాలో ముఫాసా తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తుందో అలా ప్రేమిస్తాడు. నాన్న ఈ సినిమా చేస్తున్నాడు అన్న వార్త విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాన్న ముఫాసాగా నటిస్తున్నందుకు నేను నిజంగా గర్వంగా ఉన్నాను. అలాగే చాలా థ్రిల్ అయ్యాను.. కానీ ముందు నేను ఫ్రోజెన్ ద్వారా డిస్నీతో కలిసి పనిచేశాను అని నాన్నని ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉన్నాను అని సితార చెప్పింది. అంతేకాదు దీని కోసం నాన్న ఎంతో కష్టపడ్డాడు, చాలా ప్రాక్టీస్ చేసాడు. ట్రైలర్ చూసిన ప్రతీసారి నాన్న స్క్రీన్‌పై వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఫాసా ఫుల్ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మీరు కూడా డిసెంబర్ 20న థియటర్స్‌లో ఫుల్ సినిమా చూడడం మిస్స్ అవ్వకండని చెప్పింది సితార.

editor

Related Articles