‘జాక్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌..

‘జాక్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌..

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న సినిమాల్లో జాక్ సినిమా ఒక‌టి. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో క‌థానాయిక‌. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఈ సినిమా బృందం తెలిపింది. ఈ మేర‌కు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

editor

Related Articles