హీరో అక్కినేని నాగచైతన్య కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా తండేల్. చందూ మొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాని 2025 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా తండేల్ సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. శివశక్తి ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చైతూ, సాయిపల్లవి శివతాండవం చూపించబోతున్నట్టు తాజా లుక్ చెబుతోంది. 2018లో గుజరాత్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. ఈ సినిమాని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
- December 18, 2024
0
218
Less than a minute
Tags:
You can share this post!
administrator

