ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు, మనస్పర్ధల వలన కొందరు విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళ హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 18 సంవత్సరాల పాటు వివాహ జీవితాన్ని గడిపిన రవి, ఆర్తి ఇప్పుడు విడాకులు తీసుకునే దశలో ఉన్నారు. వీరి డైవర్స్ కేసు కోర్ట్‌లో ఉంది. ఆ జంటకి ఆరవ్, ఆయాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే జయం రవి రీసెంట్‌గా సింగర్ కెన్నీషాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు. వారిద్దరు రిలేషన్‌లో ఉన్నారు కాబట్టే భార్యకి విడాకులు ఇచ్చాడని గుసగుసలు. దానిని జయం రవి ఖండించారు. ఇక తాజాగా జయం రవి సతీమణి ఆర్తి రవి .. గత సంవత్సరం నుండి పూర్తిగా మౌనంగా ఉన్నానని పేర్కొన్న ఆర్తి, ఇది నా బలహీనత కాదు, పిల్లల బాగు కోసమే అని చెప్పుకొచ్చింది. ప్రతి ఆరోపణ, విమర్శ నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. నా పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన బాధ్యతను మరువకూడదని అనుకున్నా అని ఆర్తి తన నోట్‌లో వెల్లడించారు. 10, 14 ఏళ్ల వయసు ఉన్న నా పిల్లల భద్రత నాకు కావాలి. నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం.. మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం.. మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోవడం గాయాల్లాంటివే. నేను అన్యాయానికి గురైన మహిళగా, భార్యగా, పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నాను. ఇప్పటికైన నేను మాట్లాడకపోతే వారికి భవిష్యత్ లేనట్టే అవుతుంది.
- May 10, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

