లైట్‌ బాయ్‌ సలహా కూడా వింటున్నా!

లైట్‌ బాయ్‌ సలహా కూడా వింటున్నా!

ముంబయిలో జరుగుతున్న వేవ్స్‌ (ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌) సదస్సులో పాల్గొన్న హీరో అల్లు అర్జున్‌ తన కెరీర్‌తో పాటు పలు వ్యక్తిగత అంశాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డీజే, నా పేరు సూర్య సినిమాలు పరాజయం పాలవ్వడంతో దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమాల విడుదలకు ముందు తాను ఎవరి సలహాలు పాటించలేదని, జీవితం పట్ల ఉదాసీన వైఖరితో ఉన్నానని బన్నీ తెలిపారు. ఇతరుల సలహాలు తీసుకోవడంలో తప్పులేదనిపించింది. అప్పటి నుండి లైట్‌ బాయ్‌ సలహాలు కూడా స్వీకరించడానికి వెనకాడటం లేదు. కొందరు వ్యక్తిత్వ నిపుణుల సలహాలు తీసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నా’ అని అల్లు అర్జున్‌ చెప్పారు. అట్లీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు భారతీయ సినిమాలో రానటువంటి కాన్సెప్ట్‌ ఇదని, భారతీయ మూలాలున్న ఈ కథని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నామని చెప్పారు.

editor

Related Articles