బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. వచ్చే నెల 11న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే విజయ్‌తోపాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి తదితరులకు ఈడీ తాఖీదులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 6న విచారణకు రావాలని తెలిపింది. అయితే ముందస్తు కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లు ఉన్న కారణంగా ఆ రోజున విచారణకు హాజరుకాలేనని విజయ్ దేవరకొండ ఈడీకి సమాచారం ఇచ్చారు. మరో తేదీ కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలంటూ తాజాగా స్పష్టం చేసింది. ఇదే కేసులో రానా దగ్గుబాటిని కూడా అదే రోజున విచారించనుంది. మరోవైపు నటులు ప్రకాష్‌రాజ్ ఈ నెల 30న, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది.
- July 24, 2025
0
194
Less than a minute
Tags:
You can share this post!
administrator

