‘దుల్కర్’ కొత్త సినిమా “ఆకాశంలో ఒక తార” షూటింగ్ స్టార్ట్!

‘దుల్కర్’ కొత్త సినిమా “ఆకాశంలో ఒక తార” షూటింగ్ స్టార్ట్!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన హీరోగా ఇక్కడ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో డైరెక్ట్ తెలుగు సినిమా “ఆకాశంలో ఒక తార”లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఐతే, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో దుల్కర్‌పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. ముఖ్యంగా ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటుల గురించి త్వరలోనే వెల్లడించనున్నారు.

editor

Related Articles