మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా “కన్నప్ప”. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి హీరో ప్రభాస్ లుక్ రివీల్ అయింది. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ఇంటర్వెల్ తరువాత వస్తుందని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మహాభారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది భక్తి సినిమా మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్‌బాబు ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమాకి మోహన్‌బాబు నిర్మాతగానే కాక ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

- February 3, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor