వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అరుదైన రికార్డును నమోదు చేసింది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేగాకుండా తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి సినిమాగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్ నుంచి సీనియర్ నటులలో రూ.300 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన నటుడిగా వెంకీ మామ రికార్డు సృష్టించాడు.

- February 3, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor