స్త్రీలను ఆక్షేపించ వద్దు, ప్రేమించండి: సిద్ధార్థ్

స్త్రీలను ఆక్షేపించ వద్దు, ప్రేమించండి: సిద్ధార్థ్

సిద్ధార్థ్ తదుపరి సినిమా ఇండియన్ 3, ది టెస్టులో కనిపించనున్నాడు. ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో పనిచేసిన హీరో సిద్ధార్థ్ వల్గారిటీతో కూడిన పాత్రలను తిరస్కరించారు. ఇటీవల హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో హీరో తన ఆలోచనలను షేర్ చేశారు. గాయని – రచయిత విద్యారావుతో నిష్కపటమైన ఇంటరాక్షన్‌లో, నేను స్త్రీలను చెంపదెబ్బ కొట్టడం, ఐటెం సాంగ్‌లు చేయడం, ఒకరి బొడ్డును నొక్కడం, స్త్రీకి ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్లాలి వంటి  వాటికి సంబంధించిన స్క్రిప్ట్‌లను నేను ప్రోత్సహించను. విద్యారావు, భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ గాయని, రచయిత్రి, సిద్ధార్థ్ భార్య, నటి అదితి రావ్ హైదరీ తల్లి. సిద్ధార్థ్ ఇలా కూడా మాట్లాడారు, “అయితే, నేను విభిన్నంగా ఉంటే ఈ రోజు నేను చాలా పెద్ద సినీ నటుడిని అయి ఉండొచ్చు. కానీ, నాకు నచ్చింది సహజంగానే చేస్తాను. ఈ రోజు, నేను స్త్రీల పట్ల గౌరవంగా ఉండేవాడినని, తల్లిదండ్రులకు నేను మంచివాడిని, పిల్లలతో మంచిగా ఉండేవాడిని, నేను అందంగా కనిపిస్తానని ప్రజలు నాకు చెబుతారు. 15 ఏళ్ల క్రితం నాటి సినిమాలను వాళ్ల పిల్లలు చూడగలగడం నిజంగా అదృష్టం. ఇది చాలా సంతోషించాల్సిన విషయం.”

editor

Related Articles