డైరెక్టర్ రాజమౌళి తన సినిమాను ఓ యజ్ఞంలా భావిస్తారు. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీక్‌లకు ఆస్కారం లేకుండా రాజమౌళి టీమ్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. చిత్ర బృందం అనుమతి లేకుండా సినిమా తాలూకు ఎలాంటి సమాచారాన్ని, విశేషాలను బయటకు వెల్లడించొద్దని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం ప్రకటించలేదు.

- January 29, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor