తెలుగు, తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ సందీప్ కిషన్. ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేష్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మజాకా టైటిల్, ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి బ్యాచిలర్ ఆంథెమ్‌ను విడుదల చేశారు. వైజాగ్ ఆర్కే బీచ్ వెంబడి సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ గ్యాంగ్ పాడుకుంటున్న ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా సాగుతూ ఇంప్రెస్ చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను లియోన్ జేమ్స్ కంపోజిషన్‌లో ధనుంజయ్ పాడాడు. నాకు తెలియక అడుగుతున్నాను బీర్ బెటరా.. విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ. దీనికి రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ రీతూ వర్మ డైలాగ్స్ సరికొత్తగా ఉన్నాయి.

- January 29, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor