రెండోసారి డాక్టర్‌తోనే పెళ్లి డైరెక్టర్ క్రిష్…

రెండోసారి డాక్టర్‌తోనే పెళ్లి డైరెక్టర్ క్రిష్…

తెలుగు సినిమా డైరెక్టర్ జాగ‌ర్ల‌మూడి కృష్ణ (క్రిష్) పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గ‌మ్యం సినిమాతో టాలీవుడ్‌లో మెగాఫోన్ ప‌ట్టిన క్రిష్ ఆ త‌ర్వాత వేదం, కంచె, కొండ‌పొలం – సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం అనుష్క శెట్టితో ఘాటి అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఉత్త‌రాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో అనుష్క ట్రైబ‌ల్ మ‌హిళ‌గా నటిస్తోంది. ‘వేదం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. రీసెంట్‌గా ఘాటి సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన క్రిష్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ప్రీతి చల్లాను క్రిష్ పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ నెల‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, వచ్చే నెల‌లో పెళ్లి ముహూర్తం పెట్టుకోబోతున్న‌ట్లు వినికిడి.

administrator

Related Articles